జనగణమనలో సింధ్ తొలగించాలి

జనగణమనలో సింధ్ తొలగించాలి

న్యూ ఢిల్లీ: ‘జనగణమన’లోని సింధ్ పదానికి బదులుగా ఈశాన్యం అని సవరించాలని భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. జాతీయ గీతంలోని అనవసర పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవం బరు 26న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారని గుర్తు చేశారు. జనగణమన గీతాన్ని ఎవరినో ప్రశంసిస్తూ రాశారోనన్న అను మానాలు ఉన్నాయన్నారు. 21 అక్టోబరు 1943న ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇంఫాల్ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆలపించిన గీతాన్నే అమలు చేయాలని విన్నవించారు. సింధ్ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ భూభాగంలో ఉన్నందున దాన్ని ఈశాన్యం అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ పార్టీ పార్ల మెంటు సభ్యుడు రిపున్ బోరా రాజ్య సభలో ప్రైవేటు ముసాయిదా ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos