రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ మృతి

రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ మృతి

అనంత పురం: ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త సింగమనేని నారాయణ గారు (77) నేడు 12:50 ని౹౹లకు తుది శ్వాస విడిచారు.ఇక్కడి శ్రీనివాసనగర్లోని  వారి నివా సం వద్ద బంధు, మిత్రుల సందర్శనం కోసం భౌతిక కాయాన్ని ఉంచుతారు. శుక్రవారం  ఉదయం 8:00 గం౹౹ల నుంచి అంతియాత్ర ప్రారంభం అవుతుందని ఆయన కుమా రుడు శ్రీకాంత్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు.  సింగమనేని నారాయణ  అనంతపురం పట్టణానికి దగ్గరలో వున్న బండమీదపల్లి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జూన్ 3, 1943లో జన్మించాడు. అనంతపురంలో ఉన్నత పాఠశాల లో విద్యపూర్తి చేసారు.  తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు. జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితుడుగా  పనిచేసి 2001లో పదవీ విరమణ చేశాడు.ఇప్పటివరకు 43కు పైగా కథలు వ్రాశాడు. మొట్ట మొదటి కథ “న్యాయమెక్కడ? “1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణకథలు (1999), అనంతం (2007), సింగమ నేని కథలు(2012) అనే నాలుగు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు కథలు – కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగుకథ’ మొదలైన పుస్తకాల సంపాదకత్వం వహించాడు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించాడు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos