నాని బుజ్జగింపునకు బాబు యత్నం

నాని బుజ్జగింపునకు బాబు యత్నం

అమరావతి: తనను బుధవారం సాయంత్రం కలుసుకోవాలని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానిని బుధవారం మధ్యాహ్నం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఫోన్లో కోరారు. లోక్‌సభలో తెదేపా విప్ పదవిని నాని తిరస్కరించటం తెలిసిందే. నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. దరిమిలా ఆయన్ను బుజ్జగించేందుకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పదవుల ఎంపిక కృష్ణా జిల్లా నేతల మధ్య విబేధాలకు దారి తీసింది. బుధవారం మధ్యాహ్నం గల్లా జయదేవ్ ఆయనతో సాగించిన మంతనాలు ఫలించ లేదు. దరిమిలా బాబు స్వయంగా రంగంలోకి దిగారు. బాబుతో నాని భేటీ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.‘నాకు ఆత్మాభిమానం ఎక్కువ. దాని కోసం దేనినైనా వదులుకుంటా. గెలిచిన ముగ్గురు లోక్సభ సభ్యులు కూడా మూడు పదవుల్ని తీసుకుందామని చంద్రబాబు ఎదుట చర్చ జరిగింది. కానీ నాకు పదవుల పై వ్యామోహం లేదని ఆ రోజే చెప్పాను. తనకు లోక్సభలో విప్ పదవి కంటే లోక్సభ సభ్యత్వ పదవే చాలా గొప్పది. దాని కోసం సొంతమైనవన్నీ వదులుకుంటా తప్ప పదవికి మచ్చ మాత్రం తీసుకురాన’ని నాని ఈ సందర్భంగా జయదేవ్కు వివరించినట్లు తెలిసింది.తను భాజపాలోకి ఫిరాయిస్తున్న ప్రచురితమైన వార్తల్లో నిజం లేదన్నారు. ’అలాంటి వార్తలు రాసేవాళ్లకు నేనే చెప్పేదొకటే. చంద్రబాబు వైకాపాలోకి వెళ్తే. నేను భాజపాలోకి వెళ్తాను’అని ఘాటుగా స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos