లక్నో పేరు ఇకపై లఖన్పురి

లక్నో పేరు ఇకపై లఖన్పురి

లక్నో : లక్నో పేరు కూడా మారనుందా? ప్రధాని నరేంద్ర మోదీకి లక్నో ఆహ్వానం పలుకుతోందని సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి చేసిన ట్వీట్ ఇందుకు కార ణం. ‘శేషావతార్ భగవాన్ లక్ష్మణ్ కీ పావన్ నగరి లక్నో మే ఆప్కా స్వాగత్ ఔర్ అభినందన్”అని హిందీలో ట్వీట్ చేశారు. శేషావతారుడైన లక్ష్మణుడి పావన నగరం లక్నో మీకు స్వాగతం పలుకుతోందంటూ ఆయన ట్వీట్లో పేర్కొనడంతో లక్నో పేరును లక్ష్మణ్పురి గా మార్చునున్నారనే అభిప్రాయాలకు తావిచ్చింది. లక్ష్మణుడి భవ్యమందిరం ఇప్పటికే లక్నోలో నిర్మాణం జరుపుకొంటోంది. లక్నో పేరును లక్ష్మణ్పురిగా కానీ లఖన్పురిగా కానీ మార్చాలని బీజేపీ నేతలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మ ణుడికి గుర్తుగా లక్ష్మణ్ తిలా, లక్ష్మణ్పురి, లక్ష్మణ్ పార్క్ వంటివి నగరంలో ఉన్నాయి. యోగి సర్కార్ గతంలో అలహాబాద్ పేరును ప్రయోగ్రాజ్గా, ఫైజాబాద్ పేరును అయో ధ్యగా మార్చింది. సుల్తాన్పురిని కుష్భావన్పూర్గా, అలిగఢ్ను హరిగఢ్గా, మెయిన్పురిని మయన్పురిగా, సంభల్ను పృధ్వీరాజ్ నగర్ లేదా కల్కినగర్గా, ఫిరోజాబాద్ను చంద్ర నగర్గా, డియోబండ్ను దేవ్రాండ్గా పేరు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos