కమలం కొంప ముంచిన అతి నమ్మకం

కమలం కొంప ముంచిన అతి నమ్మకం

ముంబై : అతి నమ్మకమే భాజపా కార్యక్షేత్రంలో స్థానాన్ని సీటు కోల్పోయేలా చేసిందని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘గత శాసన సభ ఎన్నికల్లో నాగపూర్ పరిధిలో రెండు స్థానాల్లో భాజపా ఓడిపోయింది. మూడు స్థానాల్లో అతిస్వల్ప ఆధిక్యతతో గెలిచింది. దీన్ని చూస్తేనే అర్థమైపోతోంది. కార్యక్షేత్రంలో భాజపా తమ బలాన్ని కోల్పోతోందన్న విషయమ’ని సామ్నాలో సంపాదకీయంలో పేర్కొన్నారు. ‘ఈ ఓటమి మాకు పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. దిగువ సభ ఎన్నికల నుంచీ భాజపా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. నాగపూర్ భాజపాలో ప్రస్తుతం రెండు గుంపులు న్నాయి. ఒకటి గడ్కరీది. మరోటి ఫడణ్వీస్ది. ఈ ఎన్నికల్లో విద్యాధికులు, టీచర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశార’ని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos