కొనసాగుతున్న మెగా బ్రదర్ సంచలనం

  • In Film
  • January 8, 2019
  • 225 Views

సామజిక మాధ్యమాల్లో మెగా బ్రదర్ నాగబాబు సంచలనం కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో చిరు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్న నాగబాబు నందమూరి బాలకృష్ణపై వరుసగా విమర్శలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.నాగబాబు పోస్ట్ చేస్తున్న వీడియోలు,జోరు చూస్తుంటే బాలయ్య చేసిన ప్రతి కామెంట్ కు కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే రోజుకు రెండు వీడియోల చొప్పున యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు.గతంలో లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బాలయ్య చిరుని ఉద్దేశించి చేసిన కామెంట్ కు నాగబాబు తాజాగా స్పందించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.అనంతపురంలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలని బాలయ్య దగ్గరుండి జరిపించారు. ఆ సమయంలో ఉత్సవాల ఏర్పాట్లకు,ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించారా అంటూ మీడియా బాలయ్యని ప్రశ్నించగా.. నేనెవరినీ నెత్తిన పెట్టుకోను. మాకున్న గ్లామర్ చాలు. ఇంకొకరిని తీసుకొచ్చి నెత్తిన ఎక్కించుకోవాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. తనని నెత్తిన పెట్టుకోమని చిరంజీవి మీకు ఫోన్ చేసి అడిగారా అని నాగబాబు ప్రశ్నించారు. మా మనుషులు కానీ, అభిమానులు కానీ అడిగారా అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మాట్లాడడం ఏంటి.. మీ నోటి దురుసు ఏంటి.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారా అంటూ బాలయ్య వ్యాఖ్యలని నాగబాబు తీవ్రంగా తప్పుబట్టారు.మీకు గ్లామర్ ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి. నేను నెత్తిన పెట్టుకొను అంటూ డిక్టేటర్ లా మాట్లాడుతున్నారేంటి. ఒక ఎమ్మెల్యే గా ఉంది డిక్టేటర్ లా మాట్లాడుతున్నారు.. చూద్దాం వచ్చే ఎలక్షన్స్ లో ఏమవుతుందో.. అంటూ అంతే ఘాటుగా స్పందించారు. మా కుటుంబంలో అందరు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ శాంతంగా ఉండే మనుషులు. వాళ్ళెవరూ ఇలాంటి విషయాల్లో మాట్లాడరు. అందుకే నేను మాట్లాడుతున్నా అని నాగబాబు అన్నారు.మీరు ఎన్ని కామెంట్స్ చేసినా తాము మాత్రం సంయమనం పాటిస్తూనే ఉన్నాం అని నాగబాబు అన్నారు. కానీ మీరు మాత్రం కంట్రోల్ తప్పుతూనే ఉన్నారు. మీ మనుషులు కూడా కంట్రోల్ లో లేరు. మీ వ్యక్తులు కొందరు మా వ్యక్తిగత జీవితాల జోలికి వస్తున్నారు. ఇది మంచిది కాదు అంటూ నాగబాబు బాలయ్యని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos