పర్యాటకానికే కాదు దెయ్యాలకు కూడా ఈ ప్రాంతాలు ఫేమస్..

పర్యాటకానికే కాదు దెయ్యాలకు కూడా ఈ ప్రాంతాలు ఫేమస్..

దేవుళ్లు,దెయ్యాలు,మహిమలు అటువంటివి ఏమీ లేవని హేతువాదులు వాదిస్తున్నా దేవుడు ఉన్నాడని అదే సమయంలో దెయ్యాలు కూడా ఉన్నాయని బలంగా నమ్మేవాళ్ల సంఖ్య తక్కువేమి కాదు.అయితే దేవుళ్లు,దెయ్యాలు ఉన్నాయడానికి సాక్ష్యాలు అడిగితే ఎవరి దగ్గరి నుంచి సమాధానం మాత్రం వినపడదు. అయితే కొంతమంది మాత్రం ఏవోకొన్ని వీడియోలు ప్రాంతాలను మాత్రం ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులో కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో సైతం ఉండడంతో ఎక్కడెక్కిడి నుంచి దెయ్యాలున్నట్లు భావిస్తున్న ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.దీంతో దెయ్యాలున్నట్లు భావిస్తున్న సదరు ప్రాంతాలు పర్యాటకంగా కూడా గుర్తింపు పొందాయి.అందులో కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే..
బాంగ్రా కోట :
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బాంగ్రా కోట ప్రపంచంలోనే అత్యంత భయంకర ప్రాంతాల జాబితాలో సైతం చోటు దక్కించుకుంది.పగటివేళ సైతం అత్యంత భయానకంగా దర్శనమిచ్చే బాంగ్రా కోట రాత్రి సమయంలో మరింత భయంకరంగా ఉంటుంది.దీంతో ఈ కోటను చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.అయితే సూర్యోదయం సూర్యస్తమయం వరకు మాత్రమే కోటలకు అనుమతిస్తారు.సూర్యాస్తయమయం అనంతరం సూర్యోదయానికి ముందు ఈ కోటలోకి ఎవరినీ అనుమతించరు.అందుకు సంబంధించి ప్రభుత్వమే అధికారికంగా కోట ఎదుట బోర్డు పెట్టడం గమనార్హం.ఈ విషయాన్ని అతిక్రమించిన వారు ప్రాణాలు పోగొట్టు కొన్న సంఘటనలు ఉన్నాయి.

బాంగ్రా కోట


అగ్రసేన్ కి బౌలి :
దేశ రాజధాని ఢిల్లీలోని హెయిలీ రోడ్డులోనున్న అగ్రసేన్ కి బౌలి బావిని 14వ శతాబ్దంలో అగ్రసేన్ అనే మహారాజు ఈ బావిని నిర్మించినట్లు చెబుతారు.60 మీటర్ల లోతు,15 మీటర్ల వెడల్పు ఉండే ఈ బావిలో ఉన్న నీరు ఈ బావిలోకి దిగిన వ్యక్తులను తెలియకుండానే బలవనర్మణానికి ఉసిగొల్పుతున్నట్లు చెబుతారు.అందేకే ఈ బావిలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయని చెబుతుంటారు.ఈ నేపథ్యంలోనే ఈ బావిలోకి దిగడాన్ని నిషేధించారు.మరో ఆసక్తికర విషయం ఏంటంటే బావిలో 108 మెట్టు దిగిన వెంటనే ఒక రకమైన అసహజమైన వాతావరణం కలుగుతుంది.దీనికి కారణం ఏమిటోమాత్రం అంతుచిక్కడం లేదు..

అగ్రసేన్ కి బౌలి


కుల్దారా :
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జైసల్మేర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా దేశంలోని అత్యంత భయానక ప్రాంతంగా పేర్కొంటారు.హంటెడ్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన కుల్దారా ఒకప్పుడు చాలా సుసంపన్నమైన గ్రామమని అయితే ఓ మాంత్రికుడి శాపం వల్ల దెయ్యాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతారు.పగటి సమయంలో వందల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో మాత్రం ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉండటానికి సాహసించరు.రాత్రి సమయంలో అరుపులు,వింత శబ్దాలు ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందని రాత్రి సమయంలో ఇక్కడ గడిపిన వ్యక్తులు చెబుతున్నారు..

కుల్దారా


ముఖేష్ మిల్స్ :
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని కోల్బాలో 1870లో నిర్మించిన ముఖేష్ మిల్స్లో సినిమాలు,ధారావాహికల చిత్రీకరణకు చాలా ప్రసిద్ధి చెందింది.ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 90ఏళ్ల పాటు సవ్యంగానే కొనసాగిన మిల్లు 1982వ సంవత్సరంలో కార్మికులు,మిల్లు యాజమాన్యానికి వివాదాలు తలెత్తడంతో కొన్ని నెలల పాటు మూతబడింది.అయితే కార్మికులు,మిల్లు యాజమాన్యానికి జరిగిన చర్చలు సఫలం కావడంతో పునఃప్రారంభం కాగా కొద్ది రోజులకే మిల్లు భారీ అగ్నిప్రమాదానికి గురైంది.ఘటనలో మిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.దీంతో మిల్లు శాశ్వతంగా మూతబడడంతో శిథిలావస్థకు చేరుకుంది.అయితే చిత్రాలు,ధారావాహికలు తెరకెక్కించే దర్శకనిర్మాతలు ఈ మిల్లులు చిత్రీకరణ చేస్తుంటారు.అయితే నటీనటులు,టెక్నీషీయన్లు మాత్రం ఇప్పటికీ ఈ ముఖేష్ మిల్లులో చిత్రీకరణ అంటే రావడానికి చాలా భయపడతారు..

ముఖేష్ మిల్స్


శనివార్ వాడ :
మహారాష్ట్రలోని పూణె నగరంలో పేష్వా బాజీరావ్ గౌరవార్థం క్రీస్తుశకం 1732లో శనివార్ వాడ కోటను నిర్మించారు. ఈ కోట కూడా కేవలం ఉదయం పూట మాత్రమే చూడటానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ నన్ను కాపాడు…నన్ను కాపాడు అన్న కేకలు వినిపిస్తూనే ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. అవి నారాయణ రావు అనే వ్యక్తివని చెబుతారు.అతను రాజకీయ కారణాలతో హత్యకు గురయ్యాడని అయితే ఈ కోట పై ఉన్న మమకారంతో నారాయణరావు ఆత్మ ఇప్పటికీ ఇక్కడే తిరుగుతూ ఉందని చెబుతారు. ఆతని కోపం వల్లే ఈ కోట అగ్నికి ఆహుతి అయ్యిందని చెబుతారు. కోట అగ్నికి ఆహుతైన గురుతులను ఇప్పటికీ చూడవచ్చు.కాగా ఈ కోటలో ఆత్మ ఉందనే విషయాన్ని పక్కనపెడితే కోట అందాలు, గాంభీర్యానికి మాత్రం మంత్రముగ్ధులు కావాల్సిందే.

శనివార్ వాడ కోట

తాజా సమాచారం

Latest Posts

Featured Videos