మోదీ, షా నియమోల్లంఘనలపై ఆరు లోపు నిర్ణయించండి

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్షాకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై ఈ నెల ఆరో తేదీ లోపు నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. ఇందుకు ఈ నెల ఎనిమిది వరకు సమయం కావాలని ఎన్నికల సంఘం చేసిన వినతిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. తీసుకున్న చర్యల గురించి సోమవారమే తమకు తెలపాలని ఆదేశించింది. ఇప్పటికే రెండు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకున్నామని, మరో తొమ్మిది ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉందని ఎన్నికల సంఘం వివరించింది. తదుపరి విచారణను ఈ నెల ఆరుకు వాయిదా వేసింది. మోదీ, అమిత్షాల ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుస్మితా దేవ్ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos