పోలవరం రీ టెండరింగ్‌కు మోదీ, షా అనుమతి

పోలవరం రీ టెండరింగ్‌కు మోదీ, షా అనుమతి

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించాకే ముఖ్యమంత్రి జగన్ పోలవరం జలాశయం రివర్స్ టెండరింగ్ చర్యల్ని చేపట్టా రని, గత ప్రభుత్వ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేసారని వైకాపా అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి బుధ వారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఖజానాను దోచుకుందని దుయ్యబట్టారు. అవినీతి పరుల్ని శిక్షించటమే తమ దృఢసంకల్పమన్నారు. అవినీతిని అడ్డు కోవటంతో తమ సంకల్పానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయ న్నారు. వారి ద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయాన్నయినా తీసుకుంటున్నార న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos