బీజేపీ పేకమేడల్లా కూలిపోతుంది

బీజేపీ పేకమేడల్లా కూలిపోతుంది

బెంగళూరు: ‘ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అద్భుతమైన పనీతీరు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ పేకముక్కల్లా కూలిపోనుంద’ని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ జోస్యం చెప్పారు. అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి కంటే ప్రియాంక గాంధీకే ప్రాధాన్యం ఇస్తున్నార’ని మంగళవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ లో తాము చాలా బలంగా ఉన్నామని బీజేపీ అనుకుంటోంది. అయితే, యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పేకమేడల్లా కూలిపోనుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగిత పెరగడం వంటి కేంద్ర పథకాలే ఇందుకు కారణాలు కానున్నాయి. కేవలం నినాదాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. ఒకసారి ప్రజలను మూర్ఖుల్ని చేయవచ్చు. ప్రతిసారి సాధ్యం కాదు. ప్రియాంక గాంధీ అత్యద్భుత పనితీరు ప్రదర్శిస్తున్నారు. ప్రజలూ ఇందిరా గాంధీని ఆమెలో చూసు కుంటున్నారు. యోగి కంటే ఆమెకే ఎక్కువ ప్రజాదరణ లభించడం ఖాయమన్నా’రు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. పంజాబ్ వ్యవహారాల్లో అధిష్టానం సకాలంలో సరైన చర్యలు తీసుకుంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారు. పార్టీని కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. సిద్ధూ ఎంపికలో తప్పులేదు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పెద్దమనసే. ఎవరినీ వదులుకోకుండా అందరికీ ప్రాధాన్యం కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తోందని, చాలా మంచి నాయకత్వం ఉందని చెప్పారు. తిరిగి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుంద’ని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos