మొబైల్ ఉంటేనే రేష‌న్ స‌రకులు..

మొబైల్ ఉంటేనే రేష‌న్ స‌రకులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ పూర్తిగా గ్రామ‌, వార్డు వాలంటీర్ల చేతుల్లోకి వెళ్ల‌నుంది.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వాళ్లే నేరుగా వాహ‌నాల ద్వారా స‌రుకుల‌ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్న‌వారి అర్హ‌త‌ను బ‌ట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి నేరుగా స‌రుకులు రేష‌ణ్ దుకాణాల‌కు వ‌స్తాయి. అక్క‌డి నుంచి స‌రుకులు తీసుకుని త‌మ ప‌రిధిలోని ఇళ్ల‌కు వాలంటీర్లు అంద‌జేస్తారు.నూత‌న ఏడాది నుంచి రేష‌న్ తీసుకోవాలంటే.. ప్ర‌తి ఇంటికి మొబైల్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండి తీరాలి. స‌రుకులు అంద‌జేసిన త‌ర్వాత ఆ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు త‌మ స‌ర్వ‌ర్‌లో న‌మోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి స‌రుకులు చేరిన‌ట్లు లెక్క‌.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos