కూటి కోసం పలుగు పార పట్టిన మేధావులు

కూటి  కోసం పలుగు పార పట్టిన మేధావులు

హైదరా బాదు: కరోనా జీవితాలను తల కిందులు చేసింది. వేల రూపాయల వేతనాలను పొందిన వారిలో చాలా మంది ఇప్పుడు డు కూలీలుగా మిగిలారు. వారిలో హైదరాబాద్ కు చెందిన చిరంజీవి, పద్మ దంపతుల వ్యధ వెలుగు చూసింది. పీజీ, బీఈడీ చేసిన చిరంజీవి, ఎంబీఏ చేసిన పద్మలు టీచర్లు. లాక్ డౌన్ ముందు వరకూ ఎంతో ఆనందంగా గడిపారు. మంచి వేతనం తీసుకున్నారు. బడులు మూతబడటంతో ఇద్దరూ ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీలుగా భువనగిరి – యాదాద్రి జిల్లాలో పని చేస్తున్నారు. రోజు వారి కూలీ రూ. 200, 300 ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రుల్ని పోషించటం అనివార్యమైందని ఆక్రోశించారు. ‘నేను పన్నెండేళ్లుగా సోషల్ సైన్స్ పాఠాలు బోధిస్తున్నాను. కరోనా వల్ల నా ఉద్యోగం పోయింది. అందుకే కూలీ పని చేస్తున్నాను. నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నాలాగే వేలాది మంది వారి ఉద్యోగాలు కోల్పోయారు” అని చిరంజీవి చెప్పారు. తమతో బాటు లో పీహెచ్డీ టీచర్ రమేశ్, పీటీ టీచర్ కృష్ణ తదితరులు, ఉన్నత విద్యలను అభ్యసించిన వారూ కూలీలుగా పని చేస్తున్నారు. గత మార్చి వరకూ రూ.లక్ష వేతనం తీసుకున్న స్వప్న అనే యువతి కూడా ఇప్పుడు కూలీ. ‘నేను దాచుకున్న డబ్బుతో బతికేయగలను. నేను కూలీగా పని చేయాల్సిన అవసరం లేదు. ఉన్న డబ్బు పెట్టుకుని ఎంతకాలం తినాలి? ఈ పొదుపు కూడా అయిపోతే నా పరిస్థితి ఏంటి? లాక్ డౌన్ మరింత కాలం కొనసాగితే నా పరిస్థితి ఏమిటి? ఈ పనులు చేసేందుకు వచ్చాను. కొంత అదనపు ఆదాయం లభిస్తే బాగుంటుందని ఆలోచించాన’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos