నేడో రేపో కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి గుడ్‌బై?

వరుసగా 12 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అధికార పక్షంలో విలీనమైన కాంగ్రెస్‌కు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా షాకివ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ అధిష్టానంపై,కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బీజేపీపై ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుధవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పేర్కొంది.దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.దీంతో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరడానికి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, భాజపాలో కీలక పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. మండలానికి చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకొని కాంగ్రెస్‌ను వీడే విషయంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.పార్టీ మార్పిడిపై బహిరంగ ప్రకటన చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దానికి ముందు అంబర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.బీజేపీ కీలక నేతలతో చర్చించి బీజేపీలో చేరే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే సాయంత్రం 4 గంటలకు తన నియోజకవర్గంలో పార్టీకార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, షోకాజ్ నోటీసులు జారీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను సైతం తనతోపాటే తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.మెుత్తానికి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కు ముగింపు పలకబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమా లేక బీజేపీలో చేరడమా రెండింటిలో ఏదో ఒకటి తేలిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos