ఎమ్మెల్యే ఇంట్లో ఏకే 47

ఎమ్మెల్యే ఇంట్లో  ఏకే 47

పట్నా: బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నద్వా గ్రామంలో మొకామా శాసన సభ్యుడు అనంత్ కుమార్ సింగ్ నివాసంపై పోలీసులు శనివారం దాడి జరిపి ఒక ఏకే 47 తుపాకి, తూటాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత్ కుమార్ పూర్వాశ్రమంలో బంధిపోటు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.ఎస్పీ కంఠేశ్ మిశ్రా పోలీసులు బాద్ ప్రాంతంలో సోదాలను నిర్వహించటంలో ఎమ్మెల్యే నివాసంలో కూడా చేసారు.స్పెషల్ టాస్క్ ఫోర్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, బాంబుల్ని నిర్వీర్యం చేసే దళం, పోలీసు జాగిలాలను కూడా రప్పిస్తున్నారు. సోదాలు ఇంకా సాగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos