హిందీని బలవంతంగా రుద్దితే సహించేది

హిందీని బలవంతంగా రుద్దితే సహించేది

చెన్నై: తమిళులపై హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదని తమిళనాడు విపక్ష నాయకుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శనివారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురి చేసాయాన్నారు. ‘ ఇలాంటి వ్యాఖ్య లతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఎల్లుండి జరగనున్న డీఎంకే కార్య నిర్వా హక సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తామ’ని పేర్కొన్నారు. హిందీని దేశమంతా బలవంతంగా రుద్దాలనుకోవడం మూర్ఖ త్వమని తమిళ నేత వైగో విమర్శించారు. అదే జరిగితే హిందీ భాషను వద్దనుకునే రాష్ట్రాలు భారత్ లో ఉండబోవని తీవ్ర హెచ్చరికలు చేశారు. హిందీ ని జాతీయ భాషగా చిత్రీకరించడం దేశానికి శాపమని వ్యాఖ్యానించారు. భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని అమిత్ షా ప్రకటించటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos