బస్టాండ్‌లలో మిని థియేటర్లు…

బస్టాండ్‌లలో మిని థియేటర్లు…

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అదే సేవల నుంచి ఆదాయం కూడా పొందడానికి టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ క్రమంలో ఆర్టీసీబస్టాండ్‌లను ఆధునీకరించి బస్టాండ్‌ ప్రాంగణంలో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి టీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోంది.గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎనిమిది బస్టాండ్‌ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు కసతరత్తులు ముమ్మరం చేశారు.ఆర్టీసీలో నష్టాలు తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలంటూ రవాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేసిన సూచన మేరకు అధికారలు ఈ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే రూ.9.5 కోట్ల వ్యయంతో ఎంజీబీఎస్‌ను ఆధునీకకరించారు.ఎల్‌ఈడీ స్క్రీన్లు,ఏసీ విశ్రాంతి గదులు తదతర ఆధునిక హంగులతో ఎంజీబీఎస్‌ను తీర్చిదిద్దారు. జూబ్లి బస్టాండ్‌ను కూడా ఇదేవిధంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు గ్రేటర్‌ పరిధిలోని ఎనిమిది ప్రాంగణాల్లో రెండతస్థుల భవనాలు నిర్మించి అందులో మిని థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి సంబంధించి సాధ్యసాధ్యాలను పరిశీలించడానికి అధికారుల బృందం పర్యటించనుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగతా మరో 72 ప్రధాన బస్టాండ్‌లలో కూడా మినీ థియేరట్లు,వ్యాపార సముదాయాలు,బడ్జెట్‌ హోటళ్ల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు గురించి ఆర్‌ అండ్‌ డీ,జేఎన్‌టీయూ,నేషనల్‌ వర్శిటీ ఆఫ్‌ కాలేజీ అధికారుల బృందం పరిశీలించనుంది.ఇదిలా ఉండగా ఎంజీబీఎస్‌,జేబీఎస్‌,ఉప్పల్‌,బోడుప్పల్‌,మెట్టుగూడ, కరీంనగర్‌, కామారెడ్డి, భద్రాచలం, హన్మకొండ, సూర్యపేట, మిర్యాలగూడ, పెద్దపల్లి,ఆసిఫాబాద్‌,దేవరకొండ బస్టాండ్‌లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేయడానికి చలన చిత్ర అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది.మినీ థియేటర్లు నిర్మించే అవకాశం లేని రద్దీ ఉన్న బస్టాండ్‌లలో ఏసీ బడ్జెట్‌ హోటళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos