చోక్సీ యాంటిగ్వా పౌరసత్వం రద్దు

చోక్సీ యాంటిగ్వా పౌరసత్వం రద్దు

యాంటిగ్వా : కరిబియన్ దీవుల్లోని యాంటిగ్వాలో తలదాచుకుంటున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభ కోణంలో పాత్రధారి, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని ఆ ప్రభుత్వం రద్దు చేసింది. నేరస్థులకు, ఆర్థిక నేరగాళ్లకు తమ దేశంలో చోటు లేదని యాంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపినట్టు స్థానిక పత్రిక యాంటిగ్వా అబ్జర్వర్ పత్రిక పేర్కొంది. చోక్సీని త్వరలోనే భారత్కు అప్పగించనున్నట్టు ప్రధాని చెప్పారు. నిరుడు జనవరిలో భారత్ నుంచి పారిపోయిన చోక్సీ యాంటిగ్వా చేరాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అవినీతి బయటడానికి రెండు నెలల ముందే పౌరసత్వాన్ని పొందాడు. న్యాయ స్థానానికి వెళ్లేందుకు నేరగాళ్లకు ఉండే ప్రాథమిక హక్కులను అనుసరించి యాంటిగ్వా ప్రభుత్వం గతంలో ఏ నిర్ణయకాన్నీ తీసుకో లేదు. వాస్తవానికి నేరస్థుల అప్పగింతపై కరీబియన్ దీవుల్లోని ఏ దేశమూ భారత్తో ఒప్పందం చేసుకోలేదు. అయినా యాంటిగ్వా ప్రభుత్వం ఈ విషయంలో ఒకడుగు ముందుకేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos