మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారు?

మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారు?

న్యూ ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారని జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ని అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం ప్రశ్నించింది. ఏ ఉద్దేశంతో ఆమెను గృహనిర్బంధం చేస్తున్నారని అడిగింది. ఆమెను కలిసేందుకు కుమార్తె ఇల్తిజ, అంకుల్ ను అనుమతించాలని ఆదేశించింది. ఇల్తిజా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ వేళ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తన తల్లిని కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని ఇల్తిజ తప్పుబట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం విచారించింది. ముఫ్తీని నిర్బంధం గురించి వారం రోజుల్లో బదులిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దరిమిలా తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా పడింది. ప్రజా రక్షణ చట్టం కింద ముఫ్తీతో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేపారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను రెండు నెలల కిందట విడుదల చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos