ఆంగ్ల మాధ్య మంతో అణగారిన వర్గాలకు మేలు

ఆంగ్ల మాధ్య మంతో అణగారిన వర్గాలకు మేలు

అమరావతి: ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్య మంలోనే విద్యా బోధన ముసాయిదా శాసనసభలో ఆమోదాన్ని పొందిన తర్వాత ప్రసటించారు. ‘ ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీ షు లో చదువుకుంటే. పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది. కంప్యూటర్ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గత సమా వే శాల్లో ముసాయిదాను తీసుకువస్తే తెదేపా ఎగువ సభలో అడ్డుకుంది. పేదవాడికి మంచి జరుగకుడా వారు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటాడు. మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో ఆహార పదార్థాల పట్టికను తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్లో విద్యా కానుక కిట్ అందిస్తాం’’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos