చౌకబారు మాధ్యమాలు

చౌకబారు మాధ్యమాలు

అమరావతి : ‘కొన్ని మాధ్యమాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్ల కోసం ప్రయత్నిస్తారా? సమాజహితం అవసరం లేదా?’ అని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నిలదీశారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రెండు రోజుల కిందట తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలను కొన్ని మాధ్యమాలు తప్పుగా చిత్రీకరించాయని మండిపడ్డారు. క్వారంటైన్కు వెళ్లకుండా వారిని రాష్ట్రంలోకి ఎలా అనుమతి స్తామని ప్రశ్నించారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్లను తీసుకురాలేక పోవడం బాధాకరం. వారంతా ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 14 నుంచి 28 రోజులపాటు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం లేని పరిస్థితి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos