డెంకణీకోటలో మాంసం దుకాణాల సీజ్


హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోటలో శుభ్రత పాటించని ఎనిమిది మాంసపు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కూరగాయలు, మాంసం దుకాణాలను కొన్ని నిబంధనలతో నడపడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.డెంకణీకోటలోని మాంసం దుకాణాలు నిబంధనలతో పాటు శుభ్రత పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అధికారులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుభ్రత పాటించని అయిదు దుకాణాలను సీజ్ చేశారు. డెంకణీకోట సమీపంలోని బెన్నంగూర్ గ్రామంలో శుభ్రత పాటించని మూడు చికెన్ సెంటర్లను కూడా సీజ్ చేశారు. అధికారుల ఆకస్మిక తనిఖీలతో దుకాణాల యజమానులు బిత్తరపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos