చిదంబరానికీ జైలు భోజనమే

చిదంబరానికీ  జైలు భోజనమే

న్యూ ఢిల్లీ : ఐన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో బంధీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి సాధారణ ఆహారమే ఇవ్వాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం గురువారం సూచించింది. చిదంబరం బెయిల్ వినతి విచారణ సందర్భంగా ఆయనకు ఇంటి ఆహారం అందించాలని న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విన్నవించారు. ఇందుకు న్యాయమూర్తి సురేశ్ కుమార్ ఖైత్ నిరాకరించారు. ‘చిదంబరం వయస్సు 74 ఏళ్లు. వయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంటి భోజనానికి విన్నవించాన’ని సిబాల్ వివరించారు. ఈ దశలో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకున్నారు. చిదంబరం కంటే పెద్దవారైన ఇండియన్ నేషనల్ లోక్దల్ నాయకుడైన ఓంప్రకాశ్ చౌతాలాకు కూడా సాధారణ ఆహారమే ఇస్తున్నారని గుర్తు చేశారు. జైలులో ప్రతీఒక్కరిని సమానంగా చూడాలని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos