ఎం.సెట్‌ ఫలితాల విడుదల

ఎం.సెట్‌ ఫలితాల విడుదల

అమరావతి: ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాల్ని మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, విద్యా మండలి అధ్యక్షుడు విజయరాజు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,82,901 మంది విద్యార్థులు దరఖాస్తు చేసారు. 1,85,711 మంది ఇంజనీరింగ్, 81,916 మంది వ్యవసాయ, వైద్య విజ్ఙాన శాస్త్రాల పరీక్షల్ని రాసారు. తెలంగాణకు చెందిన 36,698 విద్యార్థులు పరీక్షల్ని రాసారు. గత నాలుగేళ్లలో జూన్‌లో ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇంజనీరింగ్లో పినిశెట్టి రవితేజకు , వైద్య విజ్ఞాన శాస్త్రంలో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకులు వచ్చాయి.గత ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఈ పరీక్షల్ని నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos