కోట్లాది హృదయాల్ని దోచుకున్న ఏడో తరగతి విద్యార్థి

కోట్లాది హృదయాల్ని దోచుకున్న ఏడో తరగతి విద్యార్థి

ఏడో తరగతి విద్యార్థి ఒకరు లెక్కలకు ఆవల వాస్తవంలోకి తొంగి చూసి పరీక్షలో ఇచ్చిన సమాధానం కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. ప్రశ్న పత్రంలోని లెక్కకు సమాధానాన్ని చక్కగా రాసాడు. అనంతరం సమాజంలో నెలకొన్న దుస్థితి, వాస్తవాన్ని కూడా గ్రహించి చేసిన వ్యాఖ్యలు జవాబు పత్రాన్ని  దిద్దిన ఉపాధ్యాయిని మనసుకు హత్తుకుంది. దీంతో ఆమె తనకు తెలిసిన వారికి ఆ ఆన్సర్ షీట్‌ను ట్వీట్ చేసింది. ఇది సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ఇది ఏ పాఠశాల, ఏ ప్రాంతం తదితర వివరాలు బహిర్గతం కాలేదు. ఒక మహిళ 15 నెల్లలో రూ.18 వేలు సంపాదిస్తే ఆమె నెల సంపాదన ఎంత? ఏడు నెలలకు ఎంత సంపాదిస్తుంది? రూ. 30 వేలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పని చేయాలి? అనేది ఆ ప్రశ్న. దీనికి ఆ విద్యార్థి సరైన జవాబులు రాసాడు.  తర్వాత కొస మెరుపుగా‘   మహిళా కార్మికులకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ’ అని నేటి మహిళా కార్మికుల దుస్థితికి అద్దం పట్టే వాక్యాన్ని రాశాడు. ఆ సమాధానం ఉపాధ్యాయిని మనస్సును హత్తుకు పోయింది. దీంతో  ఆమె తనకు తెలిసిన వ్యక్తికి ఆ ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి ట్వీట్‌ చేసింది. ‘ఈ ప్రశ్నకు ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం ఇది. చివరి లైన్ చూడు. గణితానికి ఆవలకు వెళ్లి ఆ విద్యార్థి ఆలోచించాడు’ అని ఆ టీచర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడా కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వయసులోనే సమాజంలో ఏ జరుగుతోందో తెలుసుకో గలిగాడని ప్రశంసిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos