మారుతి నుంచి కొత్త వేగనార్

మారుతి నుంచి కొత్త వేగనార్

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌  సంస్థ మారుతి సుజుకి మూడో జనరేషన్‌ వేగనార్‌ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. సరికొత్త 2019 ఎడిషన్‌ వేగనార్‌  కొత్త డిజైన్‌తో ముందుకు వచ్చింది. ప్రారంభ ధర రూ.4.19లక్షలు(ఎక్స్‌-షోరూం దిల్లీ). ఇందులో LXI, VXI, ZXI వేరియంట్లు ఉన్నాయి. 1.0లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్ గతంలో ఉండగా ఇప్పుడు 1.2లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కూడా చేర్చారు. ఈ సరికొత్త వేగనార్‌ను కొత్త జనరేషన్‌ హ్యుందాయ్‌ శాంత్రో, టాటా టియాగోలకు పోటీగా ప్రవేశపెట్టారు. కొత్త వేగనార్‌లో లీటరు ఇంజిన్‌ 67బీహెచ్‌పీ శక్తిని, 90ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 1.2లీటరు ఇంజిన్‌ 82బీహెచ్‌పీ శక్తిని, 113ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండు ఇంజిన్లకు కూడా 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. కొన్ని వేరియంట్లకు ఏజీఎస్‌ ఆటోమాటిక్‌ గేర్‌బాక్స్‌ కూడా ఉంటుంది. అలాగే డ్రైవర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌(ఈబీడీ)తోపాటు యాంటిలాక్‌ బార్కింగ్‌ సిస్టమ్‌, సీటు బెల్టు గుర్తుచేసే విధానం, వేగాన్ని హెచ్చరించే విధానం, ప్రత్యేకమైన పార్కింగ్‌ సెన్సార్లు కొత్త వేగనార్‌లో ఉన్నాయి. ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది. కొత్త వేగనార్‌ కోసం మారుతి ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos