మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు!

  • In Film
  • August 20, 2019
  • 103 Views
మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు!

మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది.ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తతో మెగా బ్రదర్‌ నాగబాబు వియ్యం అందుకోనున్నట్లు సమాచారం.అయితే ఈ పెళ్లి సంబంధం కూతురు నిహారిక కోసం కాదట తనయుడు వరుణ్‌తేజ్‌ కోసం మాట్లాడినట్లు సమాచారం.ముందు నిహారికకు పెళ్లి చేయాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించుకున్నా అందుకు కొంత సమయం కావాలంటూ నిహారిక అభ్యర్థించడంతో వరుణ్‌ తేజ్‌కు పెళ్లి చేసేయాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో పెళ్లి గురించి ప్రస్తావన వస్తే ఇతర హీరోల గురించి ప్రస్తావించి సమాధానం దాటవేసే వరుణ్‌ కొద్ది రోజుల క్రితం మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదనున్న నేనే సినిమా తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాఅని చేసిన వ్యాఖ్యలతో వరుణ్‌ పెళ్లి నిజమేనన్న టాక్ వినిపిస్తోంది.దీంతో వరుణ్‌ తేజ్‌ వివాహమాడనున్న అమ్మాయి ఎవరనే విషయంపై సినీ ప్రేక్షకులు,మెగా అభిమానులు అంతర్జాలంలో తెగ వెతుకుతున్నారట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos