కానుకల కోసం చెల్లిని పెళ్ళాడిన అన్న

కానుకల కోసం  చెల్లిని పెళ్ళాడిన అన్న

లఖ్నవూ : ఫిరోజాబాద్లో సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడో అన్న. అదీ ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. టుండ్ల బ్లాక్ పరిధిలో 51 జంటలు వివాహం చేసుకున్నాయి. పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. గృహోపకరణాలు, దుస్తులను కానుకగా ఇచ్చింది. వివాహ ఫొటోలు స్థానికంగా ప్రచారమైనపుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహాలు నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు గ్రామ అధికారులపై చర్యలు ప్రారంభించారు. వివరణ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos