రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తొలగింపు

రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తొలగింపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణశాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ని పదవి నుంచి తొలగించి సంచలనాన్ని సృష్టించారు. ‘మార్క్ ఎస్పర్ని తొలగిస్తున్నాం. ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు. క్రిస్టోఫర్ సీ మిల్లర్ తాత్కాలిక రక్షణశాఖ కార్యదర్శిగా తక్షణమే బాధ్యతలు చేపడతారు. ఆయన్ను జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్ర డైరెక్టర్గా సెనెట్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసింద’ని ట్విట్టర్లో తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న వ్యవధిలో ఎస్పర్ నాలగవ పెంటగాన్ చీఫ్గా పని చేశారు. గతంలో పౌర అశాంతిని అరికట్టడానికి ఫెడరల్ దళాలను మోహరించాలని ఎస్పర్ ఒత్తిడి చేసినందుకు ట్రంప్ ఆగ్రహించారు. దేశంలో హింస కొనసాగుతున్నప్పుడు అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను వేగంగా ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ఉత్తర్వులను ఎస్పర్ నెమ్మదిగా అమలు చేశారు. దరిమిలా ఆగ్రహంతో ఉన్నట్రంప్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ మరో 10 వారాలపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ లోపు ట్రంప్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరిని ఇంటికి పంపిస్తారోని ఆందోళన చెందుతున్నారు. క్రిస్టోఫర్ మిల్లర్ దాదాపు 31 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశాడు. 2001 అఫ్ఘనిస్తాన్లో, 2003లో ఇరాక్లో మోహరించిన ప్రత్యేక బలగాల్లో పని చేశాడు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ రహస్య ఆపరేషన్లు, ఇంటిలిజెంట్ కన్సల్టెంట్గా వ్యవహరించారు. 2018-2019లో అతను తీవ్రవాద నిరోధకత, ట్రాన్స్నేషనల్ థ్రెట్స్ విభాగంలో వైట్ హౌస్ సలహాదారుగా పనిచేశాడు. 2019 నుంచి ప్రత్యేక కార్యకలాపాల కోసం రక్షణ సహాయ కార్యదర్శిగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos