మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌రావు అరెస్ట్‌

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌రావు అరెస్ట్‌

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజంక్షన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న దీపక్ను హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేరళ అడవుల్లో నిర్వహించిన ఆపరేషన్లో దీపక్రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీపక్రావు భార్యను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేరళలో దీపక్ రావును అలియాస్ అనిల్, వికాస్ పేర్లతో పిలుస్తుంటారని తెలుస్తోంది. మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్కు చెందిన దీపక్రావు.. గతంలో రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకూ వెళ్లొచ్చాడు. చాలా కాలం మహారాష్ట్రలో పనిచేసిన దీపక్ రావు 2019లో పాలకాడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు. అరెస్ట్ చేసిన సంజయ్ దీపక్ను మరికాసేపట్లో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos