మంతెన ఆశ్రమానికీ తొలగింపు తాఖీదులు

మంతెన ఆశ్రమానికీ తొలగింపు తాఖీదులు

అమరావతి: ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజుకు చెందిన ఆశ్రమాన్ని తొలగించాలని కోరుతూ సీఆర్డీఏ అధికారులు శనివారం తాఖీదు జారీ చేశారు. కరకట్టపై ఆశ్రమాన్ని నిర్మించినట్లు అందులో పేర్కొన్నారు. దీని గురించి ఈ నెల 16న ఉన్నత న్యాయ స్థానంలో విచారణ జరిగింది. వివరణ ఇచ్చేందుకు ఆశ్రమ నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది. కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయంలో కూడా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తాఖీదు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని పేర్కొంది. ఇందులోని అంశాలకూ వివరణ ఇచ్చేందుకు కూడా నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిర్వాహకులు వివరణ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. తాఖీదులు జారీ చేసిన విషయాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos