మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమాకు కాపీనా?

  • In Film
  • June 15, 2019
  • 122 Views
మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమాకు కాపీనా?

కింగ్‌ నాగార్జున,సోనాలి బింద్రె జోడీగా తెరకెక్కిన మన్మథుడు ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.మన్మథుడు విడుదలైన దాదాపుగా 17 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చిత్రం కొత్తగానే ఉంటుంది.అంతటి హిట్‌ చిత్రానికి కొనసాగింపుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రకుల్‌ ప్రీత్‌,కీర్తిసురేశ్‌లు నాగార్జునకు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే.రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఉత్తమ స్పందన లభిస్తోంది.కాగా మన్మథుడు చిత్రం ఓ ఫ్రెంచ్‌ చిత్రానికి కాపీ అంటూ కొత్త పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.2006లో వచ్చిన ‘prete moi ta main’ అనే ఫ్రెంచ్ సినిమాలో కూడా హీరో వయసు మళ్లిన బ్రహ్మచారే.. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తడి చేయడంతో ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తెచ్చుకుంటాడు.మరి ‘మన్మథుడు 2’ సినిమా కూడా ఇదే కథతో ఉందో.. లేదో.. ట్రైలర్ రిలీజ్ అయితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.ఒక మన్మథుడు 2 టీజర్‌ బాగుందంటూ కొంతమంది ప్రశంసిస్తుంటే ఈ ఈ వయసులో నాగార్జున అలాంటి క్యారెక్టర్ చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos