అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే తెదేపా ఖాళీ..

అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే తెదేపా ఖాళీ..

 తమ అధిష్టానం పచ్చజెండా ఊపితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోతుందని మొత్తం ఖాళీ అవుతుందంటూ బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. జగన్ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ఆశాజనకంగా లేదని, అది కంటి తడుపు బడ్జెట్ మాత్రమేనని మాణిక్యాలరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన జగన్ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వ అవినీతిని వెలికితీసి చర్యలు తీసుకోగలిగే పరిస్థితి ఉందా అని అడిగారురాష్ట్రంలో కరువ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వలసపోతున్నారని, నీటి ఎద్దడి, కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు.టీడీపీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని, అధిష్టానం అనుమతి ఇస్తే భారీగా చేరికలు ఉంటాయని అన్నారు.గత ప్రభుత్వంలోని అవినీతిని బయటపెట్టి, అందుకు కారణమైన అధికారులపై, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజల పక్షం వహించి ప్రభుత్వం ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటే మద్దతు ఇస్తామని ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అవినీతిపై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని 2024లో అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos