రైతులకు మద్దతుగా గళం వినిపించినందుకు…

రైతులకు మద్దతుగా గళం వినిపించినందుకు…

న్యూఢిల్లీ : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో  ఎంపీ మేనకా గాంధీ, ఆమె తనయుడు, ఎంపీ వరుణ్‌ గాంధీలకు చోటు దక్కలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గళం వినిపించినందుకు బీజేపీ., తల్లీ తనయులను ఈ విధంగా శిక్షించింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్‌ సింగ్‌కు కూడా ఇదే గతి పట్టింది. ఆయన కూడా రైతులకు సానుభూతి వ్యక్తం చేయడం బీజేపీ దృష్టిలో పెద్ద తప్పైపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘నా మనసును కలచివేసింది’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు. బుధవారం కూడా ఈ విషయమై స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’’ అని ట్వీట్ చేశారు. గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. తాజా స్పందనతో ఆయనతో పాటు మేనకాకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించలేదని చెప్పుకొస్తున్నారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos