మలేషియా ప్రధాని రాజీనామా

మలేషియా ప్రధాని రాజీనామా

కౌలలాంపూర్‌ : మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ రాజీనామా చేశారు. రెండు వాక్యాలతో కూడిన తన రాజీనామా లేఖను మలేషియా రాజుకు పంపారు. ప్రధాని పదవికి మహతిర్‌ రాజీనామా చేసినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన పార్టీ పర్తి ప్రబూమి బెర్సతు మలేషియా కూడా అధికార కూటమి నుంచి వైదొలిగినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల 94 ఏళ్ల మహతిర్‌ పదవికి రాజీనామా చేశారు. కూటమిలో మరో కీలక నేత అన్వర్‌ ఇబ్రహీంకు అధికార పగ్గాలు అప్పగించే అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనే ఈ రాజకీయ సంక్షోభానికి దారితీసినట్టు సమాచారం. మహతిర్‌ మహ్మద్‌, అన్వర్‌ ఇబ్రహీంల మధ్య సుదీర్ఘకాలంగా రాజకీయ వైరుధ్యం నెలకొని ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos