స్పెక్టమ్ నాశనం లేనిది, అంతటా వ్యాపించినది.

స్పెక్టమ్ నాశనం లేనిది, అంతటా వ్యాపించినది.

న్యూఢిల్లీ : ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్-2022 తెలుసుకోవాలంటే భగవద్గీతను తప్పనిసరిగా చదవాలని టీఎంసీ ఫైర్బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలకు భగవద్గీతతో వెళ్తానని అన్నారు. స్పెక్ట్రం ఆత్మ అని, ధ్వంసం చేయలేమని డీఓటీ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ముసా యిదాను ప్రస్తావించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పేజీని తన ట్వీట్కు జత చేశారు. ”ఇదేమీ ఆధ్యాత్మిక గ్రంథం కాదు. 5వ పేజీలో డీఓటీ-ఇండియా వెబ్సైట్ నోట్. ఈసారి డీఓటీ అధికారులు అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు పార్లమెంటరీ స్థాయి సమితి ముందుకు భగవద్గీతతో వెళ్తాను. ఇది తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథం” అని ఆసక్తికరంగా, ఈ ట్వీట్ను తమ పార్లమెంటు సహచరులైన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, కార్తీ చిదంబరం, డీఎంకే తమిళచి తంగపాండియన్లకు ట్యాగ్ చేశారు. కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాన్ని చేసేందుకు కేంద్రం ప్రజాభిప్రాయాన్ని కోరింది. కొత్త ముసాయిదా ఆమోదం పొందితే, పాత చట్టాలైన ఇండియన్ టెలీగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1993, టెలీగ్రాఫ్ వైర్స్ యాక్ట్ 1950 రద్దు అవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos