మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్

ముంబై: మహారాష్ట్ర అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్చే గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ శనివారం ఉదయం ప్రమాణాలు చేయించారు.చాలా మంది అంచనాల్ని తల కిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు భాజపా భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల కిందట ప్రధాని మోదీతో పవార్ భేటీ అయినపుడే భాజపా-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, అమిత్ షాకు ఫడణవీస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకురావడంతో రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు శనివారం తెల్లవారు జామున ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత ;ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు, అజిత్ పవార్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos