ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ‘లెఫ్ట్ – రైట్’ ఘన విజయాలు

ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ‘లెఫ్ట్ – రైట్’ ఘన విజయాలు

పారిస్ : ఫ్రాన్స్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీపై పట్టు కోల్పోయారు. జాతీయ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి, మితవాద పార్టీలు బలం పుంజుకున్నాయి. దీంతో మాక్రాన్ మధ్యేవాద సంకీర్ణం మెజారిటీ కోల్పోయింది. తమకు పటిష్టమైన మెజారిటీ అందివ్వాలంటూ మాక్రాన్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఫలించలేదు. ఆయన సంకీర్ణం డజన్ల సంఖ్యలో సీట్లు కోల్పోయింది. మాక్రాన్ ఇటీవలే నియమించిన ప్రధానమంత్రి ఎలిసబెత్ బోర్న్ ఇది అనూహ్య పరిస్థితి అని అభివర్ణించారు. ‘వర్కింగ్ మెజారిటీ’ నిర్మించటానికి తాము ప్రయత్నిస్తామని చెప్పారు. అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలస్లో మాక్రాన్తో సుదీర్ఘ భేటీ అనంతరం ఆమె తన అధికారిక నివాసానికి చేరుకుంటుండగా.. పారిస్ నగరాన్ని ఓ తుపాను తాకింది. ఆధునిక ఫ్రాన్స్లో ఇటువంటి నేషనల్ అసెంబ్లీ ఎన్నడూ ఏర్పడలేదని ఎలిసబెత్ చెప్పారు. ”జాతీయంగా, అంతర్జాతీయంగా మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల నేపథ్యంలో.. (జాతీయ అసెంబ్లీలో) ఈ పరిస్థితి మన దేశానికి ముప్పు ఉందని చెప్తోంది” అని పేర్కొన్నారు. ”సాధ్యమైన మెజారిటీని నిర్మించటానికి రేపటి నుంచి పనిచేస్తాం” అని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos