కేంద్రం మరోషాక్‌

న్యూ ఢిల్లీ : అనుకున్నట్టే, అంతా భయపడ్డట్టే జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండిర్ ధరలను భారీగా పెంచేసేంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరుకుంది. ఆగస్టు 17న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస సిలిండర్ ధరతో చిరువ్యాపారుల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos