పోలీసుల రక్షణ కోరిన ప్రేమికులు

పోలీసుల రక్షణ కోరిన ప్రేమికులు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు తమకు రక్షణ కల్పించాలని స్థానిక మహిళా పోలీసులను ఆశ్రయించారు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని కోటఉలి మంగళం గ్రామానికి చెందిన మునియప్ప కొడుకు రూపేష్,  అదే గ్రామానికి చెందిన నారాయణప్ప కుమార్తె శిల్పా గత అయిదేళ్లుగా ప్రేమించుకున్నారు.  వీరి ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో మూడు రోజుల కిందట ఇల్లు విడిచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన హొసూరు మహిళా పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం