సాయం చేస్తానని నమ్మించి అత్యాచారం..

సాయం చేస్తానని నమ్మించి అత్యాచారం..

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినా కామాంధుల్లో ఏమాత్రం భయం కలగడం లేదనే విషయం మరోసారి రుజువైంది.ఇంటికి వెళ్లే దారి మరచిపోయిన యువతికి సహాయం చేస్తానని నమ్మించి ఓ ఆటో డ్రైవర్‌ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్‌ నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ చంద్రాయణ గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో యువతి (18) నివసిస్తోంది.ఈ నెల8వ తేదీన ఆమె తన సోదరి (10) తీసుకొని బయటకొచ్చింది.అయితే ఇంటికి వెళ్లే దారి మరచిపోవడంతో ఇంటికెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన ఆటోడ్రైవర్‌ సాయం చేస్తానని నమ్మించి నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లాడు.రాత్రి యువతి సోదరి నిద్రపోయిన అనంతరం నిందితుడు యువతి(18)పై అత్యాచారం చేశాడు.మరుసటి రోజు ఇద్దరిని ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద వదిలేశాడు.అనంతరం ఎలాగో ఇంటికి చేరుకున్న బాధితురాలు విషయాన్ని తల్లితండ్రులకు తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos