నష్టాలతో ముగిసిన ట్రేడింగ్‌

నష్టాలతో ముగిసిన ట్రేడింగ్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 38,981 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,718 వద్ద ట్రేడింగ్ అంతమైంది. టాటామోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల భారీ షేర్లు నష్ట పోవడంతో సూచీలు కోలుకోలేదు. ఎస్కార్ట్ షేర్లు 7.5శాతం కుంగాయి. ట్రాక్టర్‌ విక్రయాల్లో 15 శాతం తగ్గుదల నమోదు కావడంతో దీనికి కారణం. జెట్‌ ఎయిర్ వేస్ 20 శాతం కుంగి 52వారాల కనిష్టస్థాయికి చేరింది. వాటాల కోనుగోలుకు బిడ్లు దాఖలు చేసిన కంపెనీలు కూడా ఆసక్తిగా లేవనే వార్తలతో ఈ షేర్లు పతనమయ్యాయి. మరోపక్క ఆటో మొబైల్‌ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ షేర్లు మాత్రం 4శాతం పెరిగాయి. కంపెనీ విక్రయాల్లో 10 పెరుగుదల నమోదు కావడంతో అవి లాభపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos