నష్టాలతో వ్యాపారాలు ఆరంభం

నష్టాలతో వ్యాపారాలు ఆరంభం

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతోనే వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.43 గంటలకు సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 29,358 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు దిగజారి 8,522 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.16 దాఖలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. కరోనా వల్ల అనేక దేశాల్లో విధించిన లాక్డౌన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఇందుకు కారణం. డీసీఎం శ్రీరాం, ఆవాస్ ఫైనాన్షియర్స్, అబాట్ ఇండియా లిమిటెడ్, సిప్లా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్ని గడించాయి. కోరమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్, బంధన్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సొనాటా సాఫ్ట్ వేర్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos