నష్టాల్లో మునిగిన స్టాక్‌ మార్కెట్‌

ముంబై:లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన శుక్ర వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 1.30 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు నష్టపోయి 39,459 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 11,802 దగ్గర ట్రేడ్ అయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.68.47గా దాఖలైంది. 845 కంపెనీల షేర్లు లాభాల్ని గడించాయి. 1298 కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 119 కంపెనీల షేర్లు యథాతథంగా ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇండియా బుల్స్ హౌసింగ్ లిమిటెడ్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ భారీ నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos