నారా లోకేశ్‌ అరెస్టు

నారా లోకేశ్‌  అరెస్టు

గుంటూరు : టిడిపి నేత నారా లోకేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న గుంటూరులో దారుణహత్యకు గురయిన రమ్య ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేశ్ వెళ్లారు. అక్కడ వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో నారా లోకేశ్ను పోలీసులు అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషను కు తరలించారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్ అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలపై పోలీసులు దౌర్జన్యం చేస్తారా ? అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర పై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందని ధ్వజమెత్తారు. హత్యకు గురైన విద్యార్ధిని రమ్యకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos