11 నగరాల్లోనే లాక్డౌన్ కొనసాగింపు

11 నగరాల్లోనే లాక్డౌన్  కొనసాగింపు

న్యూఢిల్లీ : కరోనా రోగుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలు- ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్కతా ల్లో లాక్డౌన్ 5.0 విధించే వీలుందని హోం శాఖ వర్గాలు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కేసుల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, కోల్కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 80 శాతం నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం గుర్తించింది. వచ్చే నెల నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకునే వీలుంది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఒక్కరూ ముసుగు ధరించడం, భౌతిక దూరాన్ని టించడం వంటి నిబంధనలతో వ్యాయామ శాలల్ని అనుమతిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos