మొదలైన స్థానిక పోరు..

మొదలైన స్థానిక పోరు..

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా,మండల పరిషత్‌ మొదటి విడత ఎన్నికలు
సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏడు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత
ఎన్నికలు ప్రారంభమయ్యాయి.మొదటి విడతలో 197 జిల్లా,2,166 మండల పరిషత్‌ స్థానాలకు ఎన్నికలు
జరుగాల్సి ఉండగా అందులో రెండు జిల్లా,69 మండల పరిషత్‌లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు
ఎన్నికలు నిర్వహించారు.7,072 మంది ఎంపీటీసీ,882 మంది అభ్యర్థులు జిల్లా పరిషత్‌ ఎన్నికల
బరిలో నిల్చోగా 32,042 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.మూడు విడతల్లో నిర్వహించనున్న
ఎన్నికలకు 1.47 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గోనుండగా 54 వేల
మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మూడు విడతల్లో నిర్వహించనున్న మండల,జిల్లా పరిషత్‌
ఎన్నికల్లో 1.57లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.పరిషత్‌ ఎన్నికలను
ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహిస్తుండడం గమనార్హం.ఈవీఎంలపై రాజకీయ పార్టీలను
అనుమానాలు లేవనెత్తడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించడానికి
నిర్ణయించుకుంది.మండల,జిల్లా పరిషత్‌ ఎన్నికలకు వేర్వేరు బ్యాలెట్లు అందుబాటులో ఉంచారు.మండల
పరిషత్‌ ఎన్నికలకు గులాబీ రంగు,జిల్లా పరిషత్‌ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌లు కేటాయించారు.లోక్‌సభ
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించున్న సమయంలో ఎన్నికల సిబ్బంది ఎడమ చేతి చూపుడు వేలికి
సిరా గుర్తు వేసిన నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు
వేశారు.ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos