బాబు నివాసం నేల మట్టం?

బాబు నివాసం నేల మట్టం?

అమరావతి: కృష్ణా నదీ తీరాన అక్రమంగా కట్టిన నిర్మాణా లన్నింటినీ కూల్చి వేయాలని ముఖ్యమంత్రి జగ న్మోహన రెడ్డి అధికార్లను సోమవారం ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా కెలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్న భవనం ప్రజా వేదిక కూల్చి వేత తో బుధవారం నుంచి అక్రమ కట్టడాల నేల మట్టం ఆరంభం కానుందని అధికార్లు వివరించారు. నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదుల తీరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదు. దరిమిలా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని అతిథి గృహాన్ని కూడా ప్రభుత్వం కూల్చివేయ నున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కరకట్ట సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన 22 మందికి ప్రభుత్వం 2014లో తాఖీదుల్ని నోటీసులు జారీ చేసింది. వారంతా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు కావడంతో అధికారులు అంతటితో చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రే కూల్చివేతలకు ఆదేశించడంతో చంద్రబాబు నివాసంతో పాటు ఈ 22 భవనాలను కూల్చివేయవచ్చని భావిస్తున్నారు.లింగమనేని అతిథి గృహం వ్యాజ్యం కోర్టులో విచారణ సాగుతున్నందున చంద్రబాబు నివాసాన్ని ఇప్పుడే కూల్చకపోవచ్చని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చి వేయడం ద్వారా ప్రైవేటు అక్రమ కట్టడాలను సహించ బోమని జగన్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారని విశ్లేషించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos