ఫిరాయింపుల్లో తెరాస నంబవర్‌ వన్‌..

ఫిరాయింపుల్లో తెరాస నంబవర్‌ వన్‌..

తెలంగాణలో ప్రతిపక్షాన్ని అధికార పక్షంలో విలీనం రాజ్యాంగ విరుద్దమని తెరాస అధినేత కేసీఆర్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారంటూ ఆరోపణలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు బలాన్నిచ్చేలా తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌రావు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.రాజ్యాగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని సీఎల్పీని విలీనం చేసుకోవడం దారుణమని సీఎల్పీని విలీనం చేసుకొని తెరాస అధినేత కేసీఆర్‌ చాలా పెద్ద తప్పు చేశారన్నారు. శాసనసభ-లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎంకు తెలంగాణలో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.తెలంగాణలో తెరాసకు బీజేపీ పార్టీ మాత్రమే ప్రత్యామ్యాయమని వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు.ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించిందని. మోడీ అండదండలతో తెలంగాణలో సత్తా చాటుతామన్నారు.త్వరలోనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనపై తెలంగాణలో ఉద్యమాలు చేస్తామని లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు.విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన కేసీఆర్ ఫీజుల నియంత్రణపై ఏవిధమైన నిర్ణయం తీసుకోకుండా ప్రైవేటు విద్యాసంస్థలకు లాభం చేకూరుస్తుందని లక్ష్మణ్ మండిపడ్డారు. పరీక్షల్లో అన్నీ అవకతవకలేనని మండిపడ్డారు. దేశంలోనే పార్టీ ఫిరాయింపుల్లో టీఆర్ఎస్ ది నంబర్ 1 స్థానం అని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos