బకాయి తీర్చిన ప్రయాణికుడు-పట్టా పుచ్చుకున్న డ్రైవర్

బకాయి తీర్చిన ప్రయాణికుడు-పట్టా పుచ్చుకున్న డ్రైవర్

జార్జియా: అనుకోకుండా అయిన పరిచయాలు మన జీవితాల్నే మార్చేస్తాయనేందుకు ఇదొక చక్కటి నిదర్శనం. లటోన్యా యంగ్(43) ఉబెర్ డ్రైవర్. నిరుడు కెవిన్ ఎస్చ్ అనే వ్యక్తి ఆ కార్లో ప్రయాణించారు. అతనితో పిచ్చాపాటీ మాట్లాడుతూ తనకు చదువంటే చాలా ఇష్టమని, గర్భవతి కావటంతో అర్థంతరంగా చదువు ఆపేయాల్సి వచ్చిందని చెప్పింది. 2010లో తరగ తులకు వెళ్లినపుడు బకాయి 693 డాలర్లు తీర్చాలని విశ్వ విద్యాలయాధికార్లు చెప్పారు. నెలవారీగా ఆ బకాయిని చెల్లిస్తానని ఇచ్చిన భరోసాను వర్సిటీ యాజమాన్యం తిరస్కరించింది.ప్రమాదానికి గురు కావటం, ముగ్గురు బిడ్డల పోషణ తనపై ఉన్నం దున సంపాదనలో కొంత మొత్తాన్ని బకాయి చెల్లించాలనుకున్నా కుదరలేదని వివరించింది. దరిమిలా చదువుపై ఆశ వది లేసు కున్నట్లు బాధగా చెప్పింది. ఆమె మాటలన్నీ విన్న కెవిన్ ఆమెకు 120 డాలర్లు(రూ.8600పైగా) టిప్ ఇచ్చాడు. ఇంకా ఆమెకు కూడా చెప్పకుండా జార్జియా వర్సిటీకి లతోన్యా చెల్లించాల్సిన బాకీ కూడా కట్టేశాడు. విషయాన్ని తెలుసుకున్న లతోన్యా  సంతోషానికి అవధుల్లేవు. కృతజ్ఞతలు చెప్పి, తను దాచుకున్న సొమ్మును అతనికి ఇవ్వబోయింది. నిరాకరించిన కెవిన్ ఆమెను బాగా చదువుకోమని చెప్పాడు. నిరుడు ఆగస్టులో తిరిగి కాలేజిలో చేరిన లతోన్యా గత నెల్లో డిగ్రీ పట్టా పొందింది. ఈ సందర్భంగా కెవిన్తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. జార్జియా వర్సిటీ కెవిన్కు అభినందన లేఖ రాసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos