మోదీ కండ్లు తెరవకపోతే పది లక్షల మంది మరణిస్తారు

మోదీ కండ్లు తెరవకపోతే పది లక్షల మంది మరణిస్తారు

న్యూఢిలీ : భారత్లో కరోనాను కట్టడి చేయడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైంది. ఇప్పటి గణాంకాలే అందుకు ఉదాహరణని అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ విమర్శించింది. మే 4వ తేదీ నాటికి దేశంలో 2కోట్లకు పైగా కేసులు వెలుగుచూశాయని, అంటే రోజుకు సగటున 3,78 వేల కేసులు నమోదయ్యాయి. సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1 నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. మార్చి ప్రారంభంలో కరోనా రెండో దాడి ప్రారంభం కావటానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కరోనా అంతరించిపోతుందని ప్రగాల్భాలు పలికారని దుయ్యబట్టింది. కొత్త జాతుల కరోనా ఆవిర్భావం గురించి.పదే పదే చేసిన హెచ్చరికల్ని మోడీ సర్కార్ పట్టించు కోకుండా .కరోనాను జయించేశామంటూ బాకాలు ఊదింది. భారతీయుల్లో రోగ నిరోధక శక్తి మెండుగా ఉందన్న తప్పుడు నివేదికలను చూపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రకారం 21 శాతం మందిలో మాత్రమే కరోనాను కోవిడ్-2ను తట్టుకోగల యాండీబాడీస్ ఉన్నాయని తేల్చింది. .వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యమైందని విమర్శించిన వారి గొంతుకలను తొక్కి పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి కనబర్చిందని పేర్కొంది. కుంభమేళా, అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలు రోగ వ్యాప్తికి కారణమయ్యాయి. ఇవన్నీ చూస్తే కరోనా ఉపశమన చర్యల పట్ల మోడీ సర్కార్కు నిబద్ధత కొరవడిందని స్పష్టమౌతుంది. సంక్షోభ నివారణలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ముందుస్తు సిద్దత లేవు. కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాలు ముందుగా మేల్కొన్నాయి. ఇతర రాష్ట్రాలకు తగినంత ఆమ్లజనిని సరఫరా చేస్తూ ఆదర్శంగా, వెన్నుదన్నుగా నిలిచాయని ప్రశంసించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos